![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -826 లో....... దుగ్గిరాల ఇంట్లో పూజ అనంతరం గేమ్ ఆడుతారు. చీటిలో ఏది వస్తే అది చెయ్యాలి. అలా స్వప్న, రాహుల్ ఇద్దరు డాన్స్ చేస్తారు. ప్రకాష్ ధాన్యాలక్ష్మి డాన్స్ చేస్తుంది. అలాగే స్వరాజ్ తో సుభాష్, అపర్ణ డాన్స్ చేస్తారు. అప్పు, కళ్యాణ్ ఒక జంటగా చేస్తారు. ఆ తర్వాత రాజ్ చీటీ తియ్యగా ఫస్ట్ లవ్ గురించి చెప్పమని ఉంటుంది.
దాంతో రాజ్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కంపెనీ బాధ్యతలు స్వీకరించే రోజు ఒక అమ్మాయి పరదా వెనకాల డాన్స్ చేస్తూ కనిపించింది. మొహం చూడలేదు కానీ తనేందుకో నచ్చింది. ఆ తర్వాత ఆ డాన్స్ చేసింది స్వప్న అని తెలిసిందని రాజ్ అనగానే.. అయ్యో రాజ్ ఆ డాన్స్ చేసింది నేను కాదు కావ్య అని స్వప్న చెప్పగానే రాజ్ ఆశ్చర్యంగా చూస్తాడు. అంటే నేను మొదట లవ్ చేసింది నువ్వేనా అని రాజ్ అనగానే కావ్య వెళ్లి హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత రేవతి కూడా గేమ్ లో పార్టిసిపేట్ చెయ్యాలని రుద్రాణి అంటుంది. రుద్రాణితో కలిసి రేవతి డాన్స్ చేస్తుంది.
రుద్రాణి డాన్స్ చేస్తూ రేవతి ముసుగు తీసేస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఏంటి రేవతి నిన్ను ఎవరు రానివ్వడం లేదని ఇలా వచ్చావా అని రుద్రాణి అంటుంది. అసలు రేవతి అలా పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వు కదా.. ఆ రోజు నువ్వు సలహా ఇవ్వడం వల్లే పెళ్లి చేసుకుందని రుద్రాణితో ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగంలో రేవతిని అపర్ణ క్షమిస్తుంది. ఆ తర్వాత డాక్టర్ చెప్పిన విషయం కావ్యకి చెప్తుంది అప్పు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |